బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ బుధవారం ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాలలో బిజెపి నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెర లేపుతున్న భౌతిక దాడుల సంస్కృతిని బిజెపి మొదలుపెడితే దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉండవని ఆ పార్టీ నాయకులు గుర్తించాలని హెచ్చరించారు.