ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు

67చూసినవారు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం తెలంగాణా ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశమందిరములో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులతో కలిసి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతని అడుగుజాడల్లో నడుచుకోవడం మనందరికీ ఆదర్శప్రాయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్