ఎస్సీ వర్గీకరణతోనే అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సౌటా ఖాసీం శనివారం అన్నారు. లింగాల మండల కేంద్రంలో మాదిగ నాయకుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్సీ వర్గీకరణతోనే రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందుతాయని పిలుపునిస్తూ మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ స్థాపించి గత 30 ఏళ్ళుగా అనేక ఉద్యమాలు చేస్తున్నారని గుర్తు చేశారు.