నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం గుండె పోటుకు గురవ్వగా నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులు గురువారం ఆయనను పరామర్శిస్తున్నారు.