కొల్లాపూర్ మండలంలోని సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి సముద్రం రిజర్వాయర్లో స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తామని పర్యాటకశాఖ జిల్లా అధికారి నర్సింహ చెప్పారు. గురువారం దేవస్థానం అధికారి జైపాల్ రెడ్డితో కలిసి రిజర్వాయర్ను సందర్శించారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు శ్రీవారి సముద్రం రిజర్వాయర్లో విహరించేందుకు ఐదు స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు.