పుర కార్మికులకు రూ. 26 వేల గౌరవ వేతనం ఇవ్వాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం కొల్లాపూర్ పుర కార్మికుల నిరసనలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు విధుల్లో ఉండగా మరణిస్తే ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.