ఎల్లమ్మ దేవాలయంలో వైభవంగా చండీహోమం

50చూసినవారు
ఎల్లమ్మ దేవాలయంలో వైభవంగా చండీహోమం
ధన్వాడ మండలం ఎంనోనిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం చండీహోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద బ్రాహ్మణులు గ్రామస్థుల చేత మంత్రోచ్ఛారణల మధ్య చండీహోమాన్ని వైభవంగా జరిపించారు. అంతకుముందు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్