సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

4694చూసినవారు
సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
మరికల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ సెంటర్ లో సోడా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు సోడా సిలిండర్ పేలింది. దీంతో జ్యూస్ తాగేందుకు నిలిచి ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఇద్దరిలో ఒకరు కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న గోపాల్ కాగ, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్