అన్ని అర్హతలు ఉన్న గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోటకొండ ను నూతన మండలం గా ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్న పట్టించుకోవడం లేదని, ఈనెల 16 నుండి 18 వరకు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.