మరికల్ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను బుధవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ప్రిన్సిపల్ గది ముందు వేసిన ఆర్ట్ ను బాగుందని మెచ్చుకున్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ తరగతి గదులకు వెళ్లి విద్యార్థినుల స్టడీ అవర్ ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. సిలబస్ పూర్తయిందా అని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పాల్గొన్నారు.