స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. రైతుకు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని కోరుతూ బుధవారం నారాయణపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. రైతు బంధు ఇవ్వాలని, రైతులందరి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.