నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనరల్ ఆసుపత్రి, పెట్రోల్ బంక్, నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో మొత్తం వెయ్యి కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు. అనంతరం మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. బహిరంగ సభ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.