బాలల సంక్షేమంపై అందరూ బాధ్యత తీసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ అన్నారు. శుక్రవారం వనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో బాల కార్మికులు ఉన్నట్టు గుర్తించిన, బాల్య వివాహాలు జరుగుతున్న వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందించాలన్నారు.