నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ సురభి

84చూసినవారు
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ సురభి
వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలో ప్రభుత్వాసుపత్రిలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఈనెల 9న వైద్యఆరోగ్యశాఖ మంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్, ఓపీ రూమ్, హైమాస్క్ లైట్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం టీ-డయాగ్నోస్టిక్ హబ్స్ ను సందర్శించారు. ఆసుపత్రి ఒకచోట సీటీస్కాన్ మరోచోట ఉండటం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్