రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలకు నిరసనగా పెబ్బేరు చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెంకట్ రాముల యాదవ్, అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. రాహుల్ గాంధీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.