వనపర్తి జిల్లా అమరచింత ఎంపీడీఓ ఆఫీస్ కు ఓనర్ తాళం వేసి, అద్దె చెల్లించాలని మంగళవారం పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగాడు. 'నాకు అద్దె ఇవ్వడం లేదు. లక్షల్లో జీతం తీసుకునే ఎంపీడీఓ ఇలా చేయడం ఏంటి.? రోజూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. అంటే కానిస్టేబుల్ పంపారు. నా ఇల్లు నా ఇష్టం, నాకు అద్దె చెల్లించకపోతే కుటుంబంతో సహా ఇక్కడ సూసైడ్ చేసుకుంటాం అని ఓనర్ సరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె చెల్లించాలని కోరుతున్నాడు.