వనపర్తి జిల్లా మున్సిపాలిటీ కార్యాలయంలో గృహ జ్యోతి అమలు కాక రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు పడిగాపులు కాస్తున్నారని దయానంద్ ముదిరాజ్ విమర్శించారు. గురువారం పట్టణ పురపాలక కార్యాలయాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులో వార్డు ఆఫీసర్లను నియమించిన గృహజ్యోతి అమలులో జాప్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. పట్టణంలో ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియపై ప్రజలకు దిశానిర్దేశం చేయటంలో అలసత్వం వహించినట్లు తెలుస్తుందన్నారు.