వనపర్తి జిల్లాలో జేఎన్‌టియూ ఇంజనీరింగ్ కళాశాలకు త్వరలోనే నూతన భవనాల నిర్మాణాలను ప్రారంభిస్తామని, ఈ నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. గురువారం పట్టణ శివారులోని జేఎన్‌టియూ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసుకున్న గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు.