వనపర్తి జిల్లా కేంద్రంలోని జర్నల్ ఆస్పత్రి వద్ద మాజీ ప్రధాని వాజ్ పాయి 100 వ జయంతి వేడుకలను బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.