ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసం ప్రజా పాలన విజయోత్సవాలను వనపర్తి జిల్లాలో డిసెంబర్ 7 వరకు నిర్వహిస్తున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన విజయోత్సవ యాత్రను ఐడీఓసీ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. సంక్షేమ కార్యక్రమాలను కళాకారులు మేజర్ గ్రామపంచాయతీలు, మున్సిపల్ కేంద్రాలలో ప్రజలకు వివరిస్తారని అన్నారు.