వనపర్తి జిల్లా కిష్టారెడ్డిపేటలో తుమ్మల పంపు కాలనీలో పెద్దయ్య (52) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దయ్య కుమార్తె పెళ్లి హిందూ పద్ధతిలో జరగాలని పట్టు పట్టడంతో సోమవారం మధ్యాహ్నం భార్య, కుమారుడు, ఇద్దరు బామ్మర్దులు కలిసి కొట్టారు. అనంతరం రాత్రి హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి, డాగ్ స్క్వాడ్‌తో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.