పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వనపర్తి జిల్లాలో బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.