సమగ్ర ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే విద్యా వ్యవస్థలో విద్యార్థులకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వనపర్తి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. సమగ్ర ఉద్యోగుల సమ్మె సోమవారం 28వ రోజుకు చేరింది. ఈ సమ్మె శిబిరాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చే వరకు సమ్మె విరమించవద్దని అప్పటివరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.