మహిళను మోసం చేసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు దావాజీపల్లికి చెందిన నందమ్మను ఫోన్ లో పరిచయం చేసుకొని పెబ్బేరుకు రమ్మని పిలిపించారు. తర్వాత బీచుపల్లి దగ్గరికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న నగలు తీసుకొని, అక్కడే వదిలేసి పారిపోయారు. అదే రోజు ఆమె పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేశారు.