వనపర్తి జిల్లాలో వర్షాలకు కోతకు గురైన పెబ్బేరు-కొల్లాపూర్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని బుధవారం ఆర్అండ్ బి అధికారులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి సూచించారు. వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, పీఏ భాస్కర్, చంద్రశేఖర్, గడ్డం వినోద్, తదితరులు పాల్గొన్నారు.