బోనాలతో లష్కర్ శోభాయమానంగా వెలుగొందుతోంది. సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు తెలంగాణాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీ సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.