పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ముంబై చేరుకున్నారు. శివసేన (UBT) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SP) అధ్యక్షుడు శరద్ పవార్‌లను ఆమె వేర్వేరుగా కలుసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదన్నారు. ఉద్ధవ్ నివాసం మాతోశ్రీకి వెళ్లిన ఆమెకు ఉద్ధవ్ భార్య రష్మీ థాకరే, కుమారుడు ఆదిత్య స్వాగతం పలికారు.