టవల్‌తో తిరుగుతున్నాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని కర్రలతో దారుణంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబైలోని థానే ముంబ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మస్తకీమ్‌గా అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అతడు తన బాల్కనీలో టవల్‌లో నిలబడి ఉన్నాడని పొరుగున ఉన్న మహిళలు వారి భర్తలకు ఫిర్యాదు చేయడంతో వారంతా కలిసి అతడిని తీవ్రంగా కొట్టారు.