ఇటీవల దేశవ్యాప్తంగా ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా యుపిలోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి జిమ్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అదే క్రమంలో ఉన్నటుండి కిందపడటంతో జిమ్ లో ఉన్న తోటి వ్యక్తులు అతడికి సీపీఆర్ చేశారు. కాగా సదరు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.