ఇటుకతో భార్య తల పగులగొట్టాడు (వీడియో)

109239చూసినవారు
మధ్యప్రదేశ్‌ ఇండోర్ నగరం బంగంగా ప్రాంతంలో ఆదివారం దారుణం జరిగింది. జితేంద్ర పర్మార్ అనే వ్యక్తి భార్య కాకుండా మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. భార్యను చంపేందుకు యత్నించాడు. ఆమె తలపై ఇటుకతో కొట్టి గాయపరిచాడు. బాల్కనీ నుంచి కిందికి తోసేయాలనుకున్నాడు. బాధితురాలు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్