అకస్మాత్తుగా వ్యక్తికి ఫిట్స్.. డ్రెయిన్‌లో పడి చనిపోయాడు (వీడియో)

55చూసినవారు
ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. రిక్షా డ్రైవర్ అయిన ఓ వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి కొన్నాళ్లుగా నోటి క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. రోడ్డుపై నిల్చున్న ఆయనకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దీంతో నిల్చున్న ప్రాంతంలోనే కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఓపెన్ డ్రెయిన్‌లో పడి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్