నిర్లక్ష్యం వహిస్తున్న బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు

77చూసినవారు
నిర్లక్ష్యం వహిస్తున్న బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు
బెల్లంపల్లి నియోజకవర్గం కాంటా ఏరియాలోని తాపీ భవన్ దగ్గర గల స్క్రాఫ్ దుకాణాన్ని తొలగించాలని, ఈ దుకాణం వల్ల బాటసారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని స్థానికులు తెలిపారు. పక్కనే పిల్లల హాస్పిటల్, ఫంక్షన్ హాల్, వివిధ వార్డులకు పోయే దారి. ఇనుప సామాగ్రి రోడ్డు మీద పడడం వలన నడిచి వెళ్లే వారికి గుచ్చుకొని పాయిజన్ అయ్యే అవకాశాలున్నాయి. కావున మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోగలరు అని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్