దళితులపై అత్యాచారాలకు నిరసనగా బెల్లంపల్లిలో బైక్ ర్యాలీ

62చూసినవారు
దేశంలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ఏఎంసీ నుంచి కాంటా చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిమ్న జాతి వర్గాలను రక్షించే విధంగా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్