మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో యువకులకు వల వేస్తు వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్న గుంటూరుకు చెందిన బొద్దిరెడ్డి మౌనిక, జమ్మికుంటకు చెందిన శనిగారపు మధుకర్ లను అరెస్టు చేసినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మందమర్రికి చెందిన ఓ యువకుడ్ని హనీ ట్రాప్ చేసిన దంపతులను అరెస్టు చేశామని సిఐ పేర్కొన్నారు.