నేడు గురుకులంలో తక్షణ ప్రవేశాలు

60చూసినవారు
నేడు గురుకులంలో తక్షణ ప్రవేశాలు
ఉమ్మడి జిల్లాలోని గురుకులాల్లో ఈ నెల 12న తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు జోనల్ అధికారి అరుణకుమారి తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఎస్సీ విద్యార్థులకు 5- 9 వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ చేయనున్నారు. లక్షేటిపేట బాలికల గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్