కాసిపేట మండలం మామిడిగూడెంలో జ్వరాలు విజృంభించడంతో రెండు రోజులుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి జ్వర పీడితులను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. టైర్లు, కుండలు, కూలర్లు, కుండీలలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు.