నూతన మున్సిపల్ కమిషనర్ ని కలిసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు

586చూసినవారు
నూతన మున్సిపల్ కమిషనర్ ని కలిసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యని బుధవారం మర్యాద పూర్వకంగా మాదిగ హక్కుల దండోరా నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ పట్టణంలోని మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని కమిషనర్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగపల్లి గంగాధర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కాంపల్లి రాజాం మాదిగ, రాష్ట్ర నాయకులు గంగారపు రమేష్ మాదిగ, ఎనగందుల శివాజీ మాదిగ, పట్టణ అధ్యక్షుడు కల్లెపల్లి నవీన్ మాదిగ, పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్ మాదిగ, బొడిగే యశ్వంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్