మంచిర్యాల జిల్లా లక్షెటిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఐబి గెస్ట్ హౌస్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.