వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అడిషనల్ డీఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 24వ వార్డులో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వార్డు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త పరీక్షలు చేశారు. డాక్టర్ల సూచనల మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు శిరీష, సౌజన్య, ఆశా, సూపర్వైజర్ స్రవంతి, తదితరులు ఉన్నారు.