కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామంలో శనివారం టోర్నమెంట్ ఆర్గనైజర్ & గ్రామ మాజీ సర్పంచ్ కుమ్మరి సంతోష్, కోటపల్లి ఎస్ ఐ రాజేందర్ మెగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంతోష్, ఎస్సై మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడ రంగంలో రాణించాలన్నారు. మొదటి బహుమతి 50వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 25 వేల రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు.