తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి సింగరేణి పాఠశాల లో ఎన్టీఆర్ విగ్రహం ముందు నివాళులు అర్పించారు. మానసిక వికలాంగులకు పిల్లలకు పండ్లు, బ్రెడ్. పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు.