ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన

1552చూసినవారు
ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా శని, ఆదివారం కోర్టుకు సెలవు ఉంటుందని తెలిసి పథకం ప్రకారమే అరెస్టు చేశారన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్