గాంధారి వనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. చక్కటి చెట్లతో ఉన్న ఈ ఎకో పార్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉంటుందని తెలిపారు. మంచిర్యాల డి ఎఫ్ ఓ శివ ఆశీస్ సింగ్ తో కలిసి శుక్రవారం బొక్కలగుట్ట గాంథారి వనాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గాంధారి వనాన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.