ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కోటపల్లి మండలంలోని కొల్లూరులో ఇసుక
రీచ్ ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం జిల్లాలో అధికారికంగా ఇసుక రీచ్ ల పాయింట్లు ఏర్పాటు చేసిందని వెల్లడించారు. వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వినియోగదారులకు నేరుగా సరఫరా చేస్తుందని తెలిపారు.