ఇన్ స్టాగ్రామ్ లో లైకుల కొరకు బైకులతో స్టంట్లు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. కొమ్మెర గ్రామానికి చెందిన ఒకరు, కిష్టంపేటకు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు మైనర్ కావడంతో ఆయన తండ్రి పై కేసు నమోదు చేసి తాసిల్దార్ ఎదుట రూ. రెండు లక్షల జరిమానాకు బైండోవర్ చేశామన్నారు.