జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శాసనసభపక్ష ఉపనేత పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యశాలలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ పొందటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ ఇచ్చిన లక్ష్యం మేరకు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు.