సింగరేణి కాంటాక్ట్ కార్మికులు గత15 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు కాగా సమ్మెలో భాగంగా నస్పూర్ సీసీసీ కార్నర్ ఎక్స్ రోడ్ లో రాస్తా రోకో నిర్వహించడం జరిగినది. కాగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్ట లేక పోతుంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని కార్మికులకు వేతనం పెంచడం లేదని తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోక్యం చేసుకొని యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చి కార్మికులకు వేతనాలు పెంచాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.