దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల రాజయ్య గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణంగా మరణించగా, బాధిత నిరుపేద కుటుంబానికి కన్నెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతా దృక్పథంతో బుధవారం వారిని పరామర్శించి, 10, 000/-రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.