మంచిర్యాల జిల్లా బేడ, బుడగ, జంగాల కమిటీ ఎన్నిక

3032చూసినవారు
మంచిర్యాల జిల్లా బేడ, బుడగ, జంగాల కమిటీ ఎన్నిక
అణగారిన వర్గాలకు చెందిన సమస్యను పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వానరాశి నమ్మయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని బేడ, బుడగ, జంగాల కాలనీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు హక్కుల సాధనకు సంఘం బలోపేతం లో భాగంగా మండల నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు. జన్నారం మండలం అధ్యక్షుడిగా గడ్డం రవి, ఉపాధ్యక్షులు ఈర్నాల. గంగనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో మంచిర్యాల మండల అధ్యక్షులు పస్తం శంకర్ ఉపాధ్యక్షులు చింతల. రాజేందర్, కుల పెద్దలు మోతే సత్తయ్య, చింతల. చేన్నమల్లు , చింతల. రాజు , ఊపిదీ. శంకర్, ఊపిరి గంగారం, ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల. గంగాధర్ సోషల్ మీడియా అధ్యక్షులు వనరాశి. శ్రీకాంత్, కుల పెద్దలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్