ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినట్లు మంచిర్యాలకు చెందిన మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి మాట్లాడుతూ 341 ఆర్టికల్ కు విరుద్ధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు జడ్జి చంద్ర మాడ్ ను పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నారు.